నాచారం, వెలుగు: నాచారంలో సెంట్రింగ్ వర్కర్ దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లెలగూడ మీర్‌పేట ప్రాంతానికి చెందిన కొయ్యడ మురళీకృష్ణ(45) సెంట్రింగ్ వర్క్ చేస్తుంటాడు. ఏడాది క్రితం నుంచి ఉప్పల్ కల్యాణపురిలో భార్య తులసీరత్నంతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం మీర్‌పేటలో ఉండే తన సోదరుడి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను ఓ కారులో నాచారం పారిశ్రామిక వాడ తెలంగాణ ఫుడ్స్ ఇండస్ట్రీ సమీపానికి తీసుకొచ్చారు. కత్తులతో పొడిచి హత్య చేసి పారిపోయారు. పోలీసులు డెడ్‌బాడీని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాలానగర్‌లో మరో ఘటన..
కూకట్పల్లి : బాలానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. నగరంలోని లాలాగూడకు చెందిన గఫార్(39) సెటిల్మెంట్లు చేస్తుంటాడు. ఇతనికి బాలానగర్‌కు చెందిన కొందరితో పరిచయం ఏర్పడింది. సెటిల్మెంట్స్ వ్యవహారాల్లో వారితో విభేదాలు ఏర్పడ్డాయి. సోమవారం మధ్యాహ్నం ఆయన ఐడీపీఎల్ బస్టాప్ సమీపంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో గఫార్ స్పాట్లో మృతిచెందాడు.
