మనసులే లేని లోకం : వైన్స్లో తాగుతూ చనిపోతే.. శవాన్ని రోడ్డుపై పడేశారు..

మనసులే లేని లోకం : వైన్స్లో  తాగుతూ చనిపోతే.. శవాన్ని రోడ్డుపై పడేశారు..

మందుతాగుదామని వైన్స్ కు వెళ్లాడు. ఇష్టంగా తాగాడు. పీకలదాకా తాగిన వ్యక్తి..అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయాడు. అయితే అపస్మారక స్థితిలోకి పోయాడు..బతికి ఉన్నాడా..లేక చనిపోయాడా అని చూడని వైన్స్ సిబ్బంది..ఆ వ్యక్తిని రోడ్డుపై లాగిపడేశారు. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్ నాచారం పరిధిలోని కనకదుర్గ వైన్స్ లో చోటు చేసుకుంది. 

Also Read :- లవర్‌‌కు పెండ్లైందని.. యువకుడి అత్మహత్య

 స్థానికంగా ఉండే నాగి అనే వ్యక్తి  కనక దుర్గ వైన్స్ కు వెళ్లాడు. అయితే మద్యం సేవించిన తర్వాత అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు దీంతో వైన్స్ సిబ్బంది అతడిని బయట పడేశారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. సమచారం తెలుసుకున్న నాగి కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి చూసేసరికి అప్పటికే నాగి మృతి చెందాడు. దీంతో అతని కుటుంబసభ్యులు, బంధువులు నాగి మృతదేహంతో వైన్స్ ముందు ఆందోళన చేపట్టారు. నాగి మృతిపై అనుమానాలున్నాయని..ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.