హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జయప్రదం చేయాలి

హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జయప్రదం  చేయాలి

హైదరాబాద్ : హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జయప్రదం కోసం బీజేపీ నేషనల్​ప్రెసిడెంట్ ​జేపీ నడ్డా రాష్ట్రంలోని నాయకులతో శనివారం మాట్లాడనున్నారు. జిల్లా, మండల అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్​ ద్వారా, బీజేపీ ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్​లో ఆయన భేటీ అవుతారు. ఈ నెల 12న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్ చుగ్  హైదరాబాద్​ రానున్నారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నిక, కార్యాచరణపై రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు. మరోపక్క ఈ నెల 6న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతో శనివారం ప్రజాసంగ్రామ యాత్రకు విరామం ఇవ్వనున్నారు. కాగా ఈ నెల 14న విభజన విషాద స్మృతి దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా కమిటీని బీజేపీ వేసింది.