Chay-Sobhita Anniversary: నాగ చైతన్యతో ఏడాది బంధంపై శోభిత ఎమోషనల్ పోస్ట్.. వైరల్ అవుతున్న అరుదైన వీడియో!

Chay-Sobhita Anniversary: నాగ చైతన్యతో ఏడాది బంధంపై శోభిత ఎమోషనల్ పోస్ట్.. వైరల్ అవుతున్న అరుదైన వీడియో!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య , నటి శోభిత ధూళిపాళ తమ వివాహ బంధంలోకి అడుగుపెట్టి నేటికి ( డిసెంబర్ 4న )  సరిగ్గా ఒక ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఈ జంట తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురష్కరించుకుని శోభిత తమ పెళ్లి రోజు నాటి అరుదైన , ఇంతకు ముందెన్నడూ చూడని వీడియో క్లిప్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

శోభిత ఎమోషనల్ పోస్ట్

ఈ క్లిప్ కు ఒక ఎమోషనల్ క్యాప్షన్‌ను జత చేసింది శోభిత ..  “గాలి ఎప్పుడూ ఇంటి వైపుకే వీస్తుంది. దక్కన్ ప్రాంతానికి తిరిగి వచ్చి, నేను భర్తగా పిలిచే వ్యక్తితో కలిసి సూర్యుని చుట్టూ ఒక పూర్తి ప్రయాణాన్ని (సంవత్సరాన్ని) ముగించాను. అగ్నితో శుద్ధి అయినట్లుగా నాకు కొత్త అనుభూతి కలుగుతోంది. శ్రీమతిగా ఒక సంవత్సరం...” అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచింది.

 శోభిత పోస్ట్‌కు నాగ చైతన్య కూడా స్పందించారు.. "నా ప్రియతమా, నీ ప్రయాణంలో భాగమైనందుకు నేను ధన్యుడిని. హ్యాపీ యానివర్సరీ" అని రిప్లై ఇవ్వడం అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియోలో.. నాగ చైతన్య, శోభితల సాంప్రదాయ తెలుగు వివాహ వేడుకలోని మధుర క్షణాలు అభిమానులను కనువిందు చేశాయి. ముఖ్యంగా, వారిద్దరి మధ్య ఉన్న అనురాగం, కుటుంబ సభ్యుల సంతోషం స్పష్టంగా కనిపిస్తోందంటూ విషెస్ తెలుపుతున్నారు నెటిజన్లు. 

 'ఇన్‌స్టాగ్రామ్'తో ప్రేమ..

నాగ చైతన్య, సమంత విడాకుల తర్వాత, చైతన్య వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు మీడియా మౌనంగా ఉన్న నాగ చైతన్య, శోభితల ప్రేమ బంధాన్ని, గత ఆగస్టులో చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున ధృవీకరించారు.  డిసెంబర్‌ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం జరిగింది.  

చైతు , శోభిత  ప్రేమ ప్రయాణం ఇన్ స్టాగ్రామ్ నుంచే మొదలైంది. ఈ విషయాన్ని ఇటీవల జగపతిబాబు టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్ము రా' లో చైతన్య బయటపెట్టారు. నా భాగస్వామిని సోషల్ మీడియాలో కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు.  తాను దేని లేకుండా జీవించలేనని అడిగినప్పుడు, చైతన్య నవ్వుతూ... "శోభిత, నా భార్య" అని చెప్పారు. ప్రస్తుతం ఈ జంట కెరీర్ పరంగా కూడా విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్నారు. మొదటి మ్యారేజీ యానివర్సరీ సందర్భంగా పులువురు ప్రముఖులు ఈ జంటకు విషెస్ తెలుపుతున్నారు.