Dhootha Web Series Review: ట్విస్టులతో సాగే సస్సెన్స్ థ్రిల్లర్

Dhootha Web Series Review:  ట్విస్టులతో సాగే సస్సెన్స్ థ్రిల్లర్

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) డిజిటల్ డెబ్యూ దూత (Dhootha) వెబ్ సిరీస్. సూపర్ నాచురల్ హారర్ స్టోరీతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ను విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేశాడు. దూత వెబ్ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌తో ఇవాళ (డిసెంబర్ 1న) ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంట్రెస్టింగ్‌ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ దూత..ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో సాగగా..మరి ప్రేక్షకుల అంచనాలను రిచ్ అయ్యేలా ఉందో..లేదో రివ్యూ లో తెలుసుకుందాం. 

కథేంటి?

దూత అనే టైటిల్ తోనే కథలో లాజిక్ని పెట్టేశాడు డైరెక్టర్ విక్రమ్. ఈ వెబ్ సీరీస్లో క్రియేటివ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో సాగర్ వర్మ(నాగ చైతన్య) నటించాడు. అతనికి విలువలు కంటే డబ్బే ముఖ్యం. తనదైన యాంగిల్లో న్యూస్ సేకరించే సాగర్..కొత్తగా పెట్టిన 'సమాచార పత్రిక' న్యూస్ పేపర్కి చీఫ్ ఎడిటర్గా అప్పాయింట్ అవుతాడు. ఇక తనదైన స్టైల్ లో న్యూస్ పైన ఫోకస్ చేసే సాగర్ వర్మకు..వరుస క్రైమ్స్ అన్ని తనపైనే ఫోకస్ పెట్టడం మొదలవుతుంది. 

సాగర్ చీఫ్ ఎడిటర్గా బాధ్యతలు అందుకున్న కొద్దిసేపటికే, చిన్న పేపర్ స్లిప్ ఒకటి తన కళ్ళ ముందు పడి ఉంటుంది. ఆ పేపర్ ముక్కలో సాగర్ కారుకి కాసేపట్లో ఆక్సిడెంట్ అయ్యి..అందులో కుక్క చనిపోతుందని రాసి ఉంటది.ఇది చూసి షాక్ అయిన క్షణాల్లోనే ప్రమాదం జరుగుతుంది.ఈ ఆక్సిడెంట్లో కుక్క చనిపోవడంతో సాగర్ మైండ్ సెట్ ఒక్కసారిగా పేపర్ స్లిప్ పై పడుతుంది. ఇలానే వరుసగా సాగర్ కు పేపర్ స్లిప్స్ దొరకడం..ఎక్కడి నుంచి ఈ పేపర్ స్లిప్స్ వస్తున్నాయో తెలుసుకోవడం..వంటి అంశాలపై ఫోకస్ పడుతుంది. ఇంతలోనే సాగర్ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ వరసగా చనిపోతారనే తెలియడం..నిజంగానే కళ్ళ ముందే చనిపోవడం వంటి అంశాలు ఈ వెబ్ సీరీస్ లో థ్రిల్లింగ్ పెంచేలా ఉన్నాయి. ఇంతకీ వీళ్ళ చావులకి, పేపర్  స్లిప్స్తో సంబంధం ఏంటి? సాగర్ ఫ్యామిలీనే కావాలని ఎందుకు చంపుతున్నారు? అలాగే డీసీపీ క్రాంతి (పార్వతి), ఉన్నట్టుండి సాగర్ పై ఫోకస్ పెట్టడం..సత్యమూర్తి (పశుపతి)కి సాగర్ తో లింక్ ఏంటి అనేదే 'దూత' వెబ్ స్టోరీ.

కథ ఎలా ఉంది?

జర్నలిస్ట్ సాగర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కాసేపట్లో చనిపోతారని ముందుగానే తెలియడం వంటి సీన్స్తో ఆసక్తి పెంచేలా రాసుకున్నారు డైరెక్టర్ విక్రమ్. ముందుగా తన ఫ్రెండ్ అయిన తోటి జర్నలిస్ట్ కాసేపట్లో చనిపోతాడని హీరో జర్నలిస్ట్కి సమాచారం అందుతుంది.  దీంతో సాగర్ భయపడతాడు.వెంటనే పరిగెత్తుకుని వెళ్లి మరి ఆపడానికి ట్రై చేసినప్పటికీ..తన కళ్ళ ముందే జర్నలిస్ట్ (ఫ్రెండ్) నోట్లో గన్ పెట్టుకుని కాల్చుకుని చనిపోవడం చూస్తాడు సాగర్. ఇంతలోనే సాగర్ ఫ్యామిలీ మర్డర్ అవ్వడం..అంతేకాకుండా..సాగర్ కు సంబంధించిన ప్రతి ఒక్కరు వరసగా చనిపోవడం..ఇక వాళ్ళని ఎలాగైనా కాపాడాలని ట్రై చేసిన ప్రతిసారి విఫలమవడం వంటి సీన్స్తో..స్క్రీన్ ప్లే చాలా థ్రిల్లింగ్ కలిగిస్తోంది. ఈ వరుస మర్డర్స్ అన్నింటినీ చదువుతుంటేనే ఇంత ఆసక్తిగా ఉంటే..ఇక కళ్లముందే స్క్రీన్ ప్లే పై చూస్తుంటే..ఎంత ఆసక్తిని కలిగిస్తుందో మీకే అర్ధమై ఉంటోంది.

అలాగే ఈ వెబ్ సీరీస్ స్టార్టింగ్ లోనే స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకుని చనిపోవాలని జర్నలిస్ట్ సాగర్ చనిపోవడానికి ప్రయత్నించే సీన్ తో స్టార్ట్ అవుతుంది. స్టోరీ ఆరు రోజులు క్రితానికి వెళ్తడం చూపించడం..సమాచార పత్రిక న్యూస్ పేపర్ లాంచ్ అవ్వడం..దీనికి చీఫ్ ఎడిటర్ గా జర్నలిస్ట్ సాగర్ అప్పాయింట్ అవ్వడం తో చూపించారు డైరెక్టర్ విక్రమ్. సాగర్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్తుండగా మధ్యలో కారు ఆపి ఒక దాబా వరకు వెళ్లడం..అక్కడ ఒక చిన్న స్లిప్ తన కళ్ళ ముందు కనిపించడం..అందులో కాసేపట్లో నీ కారుకి ఆక్సిడెంట్ అయ్యి..అందులో ఉన్న కుక్క చనిపోతుందని రాసి ఉండటం ఉంటుంది. ఇక వెంటనే నిజంగా ఆక్సిడెంట్ అయ్యి..కుక్క చనిపోతుంది.

ఇక వరుసగా సాగర్ ముందు ఏదో ఒక స్లిప్ ఉండటం..బెదిరించడం..నిజంగానే చంపుకుంటూ వెళ్లడం వంటి అంశాలతో డైరెక్టర్ కథనాన్ని చక్కగా పరుగెత్తించాడు. ఫ్యామిలీ,ఫ్రెండ్స్, ఓ లారీ డ్రైవర్, యూట్యూబర్..ఇలా ప్రతి ఎపిసోడ్ కి ఒకరు చనిపోవడంతో థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే తో ఉంటుంది. అంతేకాకుండా మరోవైపు సాగర్ ఓ హత్య చేస్తాడు. అతడ్ని అరెస్ట్ చేయాలని డీసీపీ క్రాంతి..అందుకు తగిన ఆధారాలు సేకరించే పనిలో ఉంటది. ఇంతకీ ఈ హత్యలకు..అప్పుడెప్పుడో స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఉన్న 'దూత' అనే న్యూస్ పేపర్ కి మధ్య ఉన్నలింక్ ఏంటనేది ఆసక్తిగా చూపించడంతో ఆడియన్స్కు కొత్త పాయింట్ను చూసిన ఫీలింగ్ కలుగుతోంది. 

అయితే ఈ సిరీస్లో థ్రిల్లింగ్ అండ్ఇంట్రెస్టింగ్ కలిగించే అంశం ఏంటంటే..మొదట్లో కొన్ని క్యారెక్టర్స్ ఎందుకు వున్నాయా అనుకునేలోపే..చివరి రెండు ఎపిసోడ్స్లో మొత్తం లింక్స్ అన్ని డైరెక్టర్ కనెక్ట్ చేసిన విధానం మంచి హై ఇస్తుంది. ఇక వెబ్ సీరీస్లో కేవలం 'f వర్డ్' తో పాటు ఓ బూతు పదేపదే వినిపిస్తోన్న ఫ్యామిలీ ఆడియాన్స్ను అంతలా ఇబ్బంది కలిగించదు. ఈ వెబ్ సిరీస్ లో చూపించే చావులన్ని థ్రిల్లింగ్ని కలిగిస్తూ..ఆలోచనలు రేకిత్తిస్తూ చేయడంలో డైరెక్టర్ విక్రమ్ స్క్రీన్ ప్లే వర్కౌట్ అయింది. అలానే దూత సిరీస్కి సీక్వెల్ ఉందని చివర్లో ప్రకటించారు.

ఎవరెలా చేశారంటే :

138 కోట్ల మందిని కాపాడుతున్న ఈ జ్యుడిషియల్ సిస్టమ్..పొలిటీషియన్స్..పోలీస్ లు వీళ్ళు తప్పు చేస్తే ఎవ్వరు ప్రశ్నిస్తారు? అది ఒక జర్నలిస్ట్ అంటూ చైతన్య ను చూపించిన విధానం బాగా ఆకట్టుకుంటోంది.ఇక జర్నలిస్ట్ పాత్రలో చై అదరగొట్టేశాడు. ఒక కార్టూన్లో చూపించిన విధంగానే వరస మర్డర్స్ జరగడం..ఆ నింద చైతన్య పై పడటం చూపించే సమయంలో చై యాక్టింగ్ బాగుంది. 

మలయాళ నటి పార్వతి డీసీపీ క్రాంతిగా నటించి మెప్పించింది. జర్నలిస్ట్ సాగర్ భార్య ప్రియాగా చేసిన ప్రియ భవాని శంకర్ తన పాత్ర  ఉన్నంతలో అలరించింది. ఇకపోతే డైరెక్టర్ తరుణ్ భాస్కర్, బ్రహ్మీ కొడుకు రాజ గౌతమ్ కనిపించింది కాసేపే అయిన నెగటివ్ రోల్స్ లో డిఫెరెంట్ గా కనిపించారు. మిగిలిన వాళ్ళందరూ పరిధి మేరకు నటించారు.

టెక్నీషియన్స్ :

డైరెక్టర్ విక్రమ్ కుమార్ చాలా రోజుల తర్వాత ఒక ఇంటెన్సివ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదరగొట్టేశాడు. మంచి ట్విస్టులతో కూడిన స్క్రీన్ ప్లే తో స్టోరీని నడిపించిన తీరు ఆకట్టుకుంటోంది. గతంలో విక్రమ్ తెరకెక్కించిన 13B థ్రిల్లర్ వంటి సినిమాతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడని అనిపిస్తోంది.ఇకపోతే, సిరీస్లో సీన్స్ అన్ని కూడా నైట్, వర్షంలోనే తీసిన..సినిమాటోగ్రాఫర్ మికాలాజ్ సైగుల చాలా బాగా చూపించారు. ఇషాన్ చబ్రా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంటెన్సివ్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి.