Anasuya Apology: డబుల్ మీనింగ్ డైలాగ్ రచ్చ.. రాశికి క్షమాపణలు చెప్పిన అనసూయ

Anasuya Apology: డబుల్ మీనింగ్ డైలాగ్ రచ్చ..  రాశికి క్షమాపణలు చెప్పిన అనసూయ

ఇటీవల యాంకర్ అనసూయ భరద్వాజ్, నటుడు శివాజీ మధ్య జరిగిన (Heroines Dressing) వ్యాఖ్యల వివాదంపై నటి రాశి స్పందించడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శివాజీ తనకు వ్యక్తిగతంగా చాలా ఏళ్లుగా తెలుసునని, ఆయన ఉద్దేశపూర్వకంగా తప్పుగా మాట్లాడలేదని అన్నారు. అయితే, కొన్ని పదాలు మాత్రం సరిగా ఉపయోగించలేదని, ఆ విషయాన్ని శివాజీ కూడా అంగీకరించి క్షమాపణ చెప్పారని తెలిపారు. అదే సమయంలో, గతంలో అనసూయ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాశి, నాలుగేళ్ల క్రితం ఓ టీవీ షోలో ‘రాశి ఫలాలు’ అని చెప్పాల్సిన చోట ‘రాశి గారి ఫలాలు’ అని మాట్లాడి నవ్వుకున్న ఘటనను గుర్తు చేశారు. మైక్ దొరికింది కదా అని ఎలా అంటే అలా మాట్లాడకూడదు అంటూ పేరు చెప్పకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది.

అనసూయ క్షమాపణలు..

యాంకర్ కం నటి అనసూయ తన గత తప్పును సోమవారం (2026 జనవరి 5న) బహిరంగంగా అంగీకరించారు. మూడు సంవత్సరాల క్రితం చేసిన ఓ షోలో తెలుగు సరిగా రానితనంపై చేసిన స్కిట్‌లో రాశి గారి పేరుతో డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పడం తప్పేనని ఒప్పుకున్నారు. ఆ సమయంలో ఆ డైలాగ్ రాసినవాళ్లను, డైరెక్ట్ చేసినవాళ్లను తాను నిలదీసి అడగాల్సిందని, కానీ అప్పటికి తన వద్ద అంత శక్తి, స్థానం లేకపోయిందని తెలిపింది. అది తన పొరపాటేనని చెబుతూ X వేదికగా అనసూయ పోస్ట్ పెట్టి సీనియర్ నటి రాశికి క్షమాపణలు తెలియజేసింది.

►ALSO READ | ఆ పదేళ్ల పిల్లోడు.. నిజంగానే థియేటర్ లోని లేడీస్ వాష్ రూంలో కెమెరా పెట్టాడా?

“రాశిగారికి నా క్షమాపణలు.. మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్ లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది కానీ “అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే. వెనక్కి వెళ్లి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను. ప్రజలు మారతారు మరియు అభివృద్ధి చెందుతారు, ఆ షోలో ద్వంద్వార్థప మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షోలో విడిచి పెట్టడం వరకు నాలోని మార్పు మీరు గమనించవచ్చు. ఈరోజు మహిళల భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి, ఆ మాటలు తీసి విద్వేష ప్రచారాన్ని నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ షో దర్శక రచయిత నిర్మాతలు.. మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెప్తున్నాను. మహిళల శరీరాల చుట్టూ నిర్మించిన కథనాలను ప్రశ్నించడానికి నేను మునుపటి కంటే మరింత బలంగా మరియు శక్తివంతంగా ఉన్నాను. మీరు అర్థం చేసుకుని మీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని అనసూయ క్షమాపణలు చెప్పింది. ఇక ఇప్పుడు అనసూయ చెప్పిన క్షమాపణలపై, సీనియర్ నటి రాశి ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది.