నాగచైతన్య నుంచి రాబోతున్న మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. మీనాక్షి చౌదరి హీరోయిన్. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా రాజస్థాన్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేశారు. అక్కడి రాజభవనాలు, పురాతన శిల్పకళతో కూడిన లొకేషన్స్‌లో ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన స్టిల్స్‌ను విడుదల చేశారు.
షూటింగ్ చివరిదశకు చేరుకోగా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. హిందీ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ, జయరామ్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాగుల్ డి హెరియన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు.
