టాలీవుడ్ బ్యూటీ ఫుల్ కపుల్స్లో నాగచైతన్య-శోభిత జంట వెరీ స్పెషల్. 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకున్న ఈ జంట అక్కినేని ఫ్యాన్స్కి ఎప్పుడు ప్రత్యేకమే. ఇవాళ ఈ జోడీ మరింత ప్రత్యేకం చేస్తూ.. అదిరిపోయే పోస్ట్తో ఫ్యాన్స్కి కిక్ ఇచ్చారు. ఆదివారం మే31, 2026న శోభిత తన 34వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా శోభితకు నాగ చైతన్య రొమాంటిక్గా విషెస్ చెప్పారు.
“హ్యాపీ బర్త్ డే మై లేడీ.. నీతో కలిసి జీవితాన్ని పంచుకునే అవకాశం దక్కినందుకు నేను కృతజ్ఞుడిని” అనే క్యాప్షన్తో చై బ్యూటీఫుల్ విషెస్ అందించారు. ఈ క్రమంలోనే అందమైన, క్లోజ్గా ఉన్న పలు రొమాంటిక్ ఫొటోలను షేర్ చేసి అభిమానుల్లో ఆసక్తి పెంచారు. శోభితకు చైతన్య కామ్రేడ్గా నిల్చినట్లుగా ఆ ఫోటోలు అర్ధాన్ని వివరిస్తున్నాయి.
ప్రస్తుతం చైతన్య విషెస్తో పాటు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వెంటనే సినీ సెలబ్రిటీలు, అభిమానులు శోభితకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తు పోస్టులు పెడుతున్నారు. అందమైన జంట.. దిష్టి తగిలేలా ఉంది.. అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. కలకాలం ఇంతే సంతోషంతో మెలగాలని అని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ జంట ఫ్యామిలీ లైఫ్తో పాటు తమ కొత్త సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగచైతన్య తండేల్ సక్సెస్తో మంచి జోష్ మీదున్నాడు. ఇదే సక్సెస్ను కొనసాగించేలా ఇపుడు తన నెక్స్ట్ మూవీ వృషకర్మతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విరూపాక్ష మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన కార్తిక్ దండు డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. మైథికల్ థ్రిల్లర్గా రానున్న ఈ మూవీలో నిధి అన్వేషకుడిగా నాగ చైతన్య కనిపించనున్నాడు.
