నాగశౌర్య, విధి జంటగా శ్రీదేవి విజయ్ కుమార్ కీలక పాత్రలో రామ్ దేశినా (రమేష్) రూపొందించిన చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించారు. ఏప్రిల్ 17న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగశౌర్య మాట్లాడుతూ ‘టీమ్ అందరి ఎఫర్ట్‌తో అవుట్‌పుట్ బాగా వచ్చింది.
రసూల్ గారి వల్ల విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. హీరోయిన్ విధికి తెలుగులో ఇది మంచి లాంచ్ అవ్వాలని కోరుకుంటున్నా. శ్రీదేవి గారితో పనిచేయడం చాలా మంచి అనుభవం. ఆమె ప్రభాస్ గారి మొదటి సినిమాలో చేశారు, నాకు కూడా అలాంటి లక్ రావాలని
కోరుకుంటున్నా. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది’ అని అన్నాడు.
తెలుగు మూవీలో యాక్ట్ చేయడం హ్యాపీగా ఉందని విధి చెప్పింది. ఈ కథ అందరికీ ఫ్రెష్ ఫీల్‌నిస్తుందని శ్రీదేవి విజయ్‌కుమార్ అన్నారు. నిర్మాత శ్రీనివాస్ చింతలపూడి మాట్లాడుతూ ‘ఇదొక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా బాగుంటాయి. శౌర్యని డిఫరెంట్ స్టైల్‌లో చూస్తారు’ అని అన్నారు. నటి సుప్రియ, డీవోపీ రసూల్, జీ స్టూడియోస్ గిరీష్ పాల్గొన్నారు.

