
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య లేటెస్ట్ మూవీ కృష్ణ వ్రింద విహారి.. టీజర్, సాంగ్స్ తో ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. ఈ నెల (సెప్టెంబర్) 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రెండు నిమిషాల పాటు ఉన్న మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నాగశౌర్య బ్రహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయిగా కనిపించనున్నాడు.
ఉద్యోగ రిత్యా హైదరాబాద్ కు వచ్చిన అతనికి సూపర్ ఫాస్ట్ అమ్మాయి పరిచయం కావడం, ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాక అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడన్నది మెయిన్ కథగా ఉండబోతున్నట్లుగా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇందులో నాగశౌర్య సరసన హీరోయిన్‌గా నటిస్తోండగా బ్రహ్మాజీ, రాధికా శరత్ కుమార్ వెన్నెల కిషోర్ తదితరలు కీరోల్ ప్లే చేస్తున్నారు.
ఐరా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకి అనీశ్ ఆర్ కృష్ణ దర్శకుడు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.