మన మూలాలను ఈ జనరేషన్ కు చూపించే ప్రయత్నమే నాగబంధం

మన మూలాలను ఈ జనరేషన్ కు చూపించే ప్రయత్నమే నాగబంధం

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా రూపొందిస్తున్న చిత్రం 'నాగబంధం'. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్స్. జగప తిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ కీలక పాత్రలు పోషించారు. ఈ మైథలాజికల్ అడ్వెంచర్ మూవీని కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. జులై 3న సినిమా విడుదల కానుంది. తాజాగా ఆనంత పద్మ నాభ స్వామి వారి రథ యాత్రతో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. మేకర్స్ ఈ సందర్భంగా విరాట్ కర్ణ మాట్లాడుతూ 'రెండేళ్లపాటు శ్రమించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.

అనంత పద్మనాభ స్వామి వారి రథయాత్రలో భాగంగా మేము అనేక నగరాలను సందర్శించబోతున్నాం. మా దర్శకుడు అభిషేక్ నామా గారి డ్రీమ్  ప్రాజెక్ట్లో నన్ను భాగం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా' అని చెప్పాడు. ఈ చిత్రంలో నటించడం బ్లెస్డ్ గా భావిస్తున్నానని నభా నటేష్ చెప్పింది. డైరెక్టర్ అభిషేక్ నామా మాట్లాడుతూ 'మన సంస్కృతి, మన మూలాలను నెక్స్ట్ జనరేషన్కు పరిచయం చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం' అని అన్నారు. రెండుతెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రథయాత్ర జరగబోతోందని నిర్మాతలు నిషిత నాగిరెడ్డి, కిషోర్ అన్నపురెడ్డి అన్నారు.