ఆ వార్తల్లో నిజం లేదు

ఆ వార్తల్లో నిజం లేదు

మంచి ఆఫర్స్ అయితేనే ఇతర భాషల్లో నటిస్తా. ఆమిర్ ఖాన్ పిలిచి ‘లాల్‌‌‌‌‌‌‌‌ సింగ్ చద్ధా’లో చాన్స్ ఇచ్చారు. అందుకే చేశా. పన్నెండేళ్ల కెరీర్​లో ఎంత నేర్చుకున్నానో.. అంతకంటే ఎక్కువే ఆయన దగ్గరున్న నలభై రోజుల్లో  నేర్చుకున్నాను. ఆమిర్​తో జర్నీ నాకు చాలా ప్లస్ అయ్యింది. ఇక నాకు ప్యాన్ ఇండియా సినిమాల పైన ఆసక్తి లేదు. అలాంటి సబ్జెక్ట్స్‌‌‌‌‌‌‌‌తో మన రీజినల్ సెన్సిటివిటీ దెబ్బ తింటుందనేది నా పర్సనల్ ఫీలింగ్. సో ప్రస్తుతం నా దృష్టంతా తెలుగు సినిమాల మీదే.

కంటెంట్ తప్ప బాక్సాఫీస్ లెక్కలు పట్టించుకోనంటున్నాడు నాగచైతన్య. శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమ్ముల డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో తను నటించిన ‘లవ్‌‌‌‌‌‌‌‌స్టోరి’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా తన మనసులోని మాటల్ని ఇలా పంచుకున్నాడు చైతు.

  • పల్లెటూరి నుంచి సిటీకొచ్చిన తక్కువ క్యాస్ట్ అబ్బాయి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అప్పర్ క్యాస్ట్ అమ్మాయితో లవ్‌‌‌‌‌‌‌‌లో పడ్డాక ఎలాంటి చాలెంజెస్‌‌‌‌‌‌‌‌  ఫేస్​ చేశాడనేది స్టోరీ. క్యాస్ట్, జెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇష్యూస్‌‌‌‌‌‌‌‌పై అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ పెంచే మూవీ.   
  • శేఖర్ కమ్ముల గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం.  ఆయన చిత్రాల్లో రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. నాకు అలాంటి చిత్రాలు ఇష్టం. అందుకే మజిలీ సినిమాతో కొంత సంతృప్తి కలిగింది. ఈ సినిమాతో నెక్స్ట్‌‌ లెవెల్ హ్యాపీనెస్ పొందాను.  
  • శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గత చిత్రాల్లో హీరోయిన్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఎక్కువ పేరొచ్చింది. కానీ ఈ సినిమాలో సాయి పల్లవితో పాటు నా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఇద్దరికీ పేరొస్తుంది. పల్లవి చాలా మంచి డ్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. నాక్కూడా డ్యాన్స్‌‌‌‌‌‌‌‌లో బాగా సపోర్ట్ చేసింది. 
  • ఇందులో నేను తెలంగాణ యాస మాట్లాడతాను. షూటింగ్‌‌‌‌‌‌‌‌కి ముందు కొంత ప్రాక్టీస్ చేశాను. లాక్ డౌన్ టైమ్​లో మరింత బాగా నేర్చుకోడానికి చాన్స్ దొరికింది. రిలీజ్ పోస్ట్‌‌‌‌‌‌‌‌పోన్‌‌‌‌‌‌‌‌ అవడం వల్ల ఈ సినిమాకి చాలా టైమ్ దొరికింది. అయితే రెండు క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌లు తీశామనే వార్తల్లో నిజం లేదు. లాక్ డౌన్ గ్యాప్‌‌‌‌‌‌‌‌లో ఎడిట్ వెర్షన్లు చూసి చూసి, బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం అదే కంటెంట్‌‌‌‌‌‌‌‌తో మరోసారి క్లైమాక్స్ షూట్ చేశాం. అంతే కానీ క్లైమాక్స్ మార్చలేదు.
  • నేను నటించిన ఏ మాయ చేశావే, 100% లవ్‌‌‌‌‌‌‌‌ సినిమాల తర్వాత ఈ ఆల్బమ్‌‌‌‌‌‌‌‌కి అంత మంచి పేరొచ్చింది. మిగిలిన సినిమాల్లో ఒకట్రెండు పాటలే కమర్షియల్‌‌‌‌‌‌‌‌గా హిట్టయితే.. ఈ ఆల్బమ్ మొత్తం వైరల్ కావడం హ్యాపీగా అనిపించింది.
  • కలెక్షన్స్, ఓపెనింగ్స్​ని నేనెప్పుడూ పట్టించుకోలేదు. కంటెంట్‌‌‌‌‌‌‌‌నే నమ్ముతాను. ఈ సినిమాపై కూడా పూర్తి నమ్మకం ఉంది. మంచి కంటెంట్ ఇస్తే ప్రేక్షకులు థియేటర్స్‌‌‌‌‌‌‌‌కి వస్తారని ఫస్ట్ లాక్ డౌన్ తర్వాత ప్రూవ్ అయ్యింది. ఈ సినిమాతో ఇండస్ట్రీ మళ్లీ రీచార్జ్ అవుతుందనే నమ్మకం ఉంది. 
  • విక్రమ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘థాంక్యూ’ మూవీ చేస్తున్నాను. పది రోజుల షూటింగ్ బ్యాలెన్స్. ఆయన డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లోనే అమెజాన్‌‌‌‌‌‌‌‌ కోసం ఓ హారర్ వెబ్ సిరీస్ చేస్తున్నా. నెగిటివ్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. నాన్నతో కలిసి ‘బంగార్రాజు’లో నటిస్తున్నా. త్వరలో కొన్ని కొత్త అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్స్ కూడా వస్తాయి.