బుద్ధవనాన్ని  తిరుపతిలా డెవలప్ చేస్తాం..అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.

బుద్ధవనాన్ని  తిరుపతిలా డెవలప్ చేస్తాం..అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.
  • టీజీటీడీసీ చైర్మన్  పటేల్  రమేశ్ రెడ్డి

హాలియా, వెలుగు: అంతర్జాతీయ ప్రమాణాలతో నాగార్జునసాగర్ లో తెలంగాణ టూరిజం నిర్మించిన బుద్ధవనాన్ని డెవలప్​ చేస్తామని టీజీటీడీసీ చైర్మన్  పటేల్  రమేశ్​రెడ్డి తెలిపారు. సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధ పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి వందనం చేశారు. వారికి బుద్ధవనం ఎస్టేట్  మేనేజర్  రవిచంద్ర పలు అంశాలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా బుద్ధవనాని తీర్చిదిద్దుతామని చెప్పారు. 

స్వదేశీ దర్శన్ లో భాగంగా బుద్ధవనం చుట్టుపక్కల ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు రూ.500 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. బుద్ధవనం ఎగ్జిక్యూటివ్  ఆఫీసర్  శాసన, డీఈ శ్రీనివాస్​రెడ్డి, విజయ విహార్  మేనేజర్  కిరణ్, సిద్ధార్థ హోటల్  నిర్వాహకులు వీరారెడ్డి, టూరిజం గైడ్  సత్యనారాయణ ఉన్నారు.