Nagarjuna: ‘కూలీ’ థియేటర్స్‌లో ‘శివ’ రీ రిలీజ్‌ ట్రైలర్.. ఆగస్టు 14న మోత మోగాల్సిందే !

Nagarjuna: ‘కూలీ’ థియేటర్స్‌లో ‘శివ’ రీ రిలీజ్‌ ట్రైలర్.. ఆగస్టు 14న మోత మోగాల్సిందే !

తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్‌ సెట్టర్‌‌గా నిలిచిన ‘శివ’ చిత్రం మూడు దశాబ్ధాల తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ  అన్నపూర్ణ స్టూడియో 50వ వార్షికోత్సవం సందర్భంగా రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం ఒరిజినల్ మోనో మిక్స్ సౌండ్‌ను తొలిసారి డాల్బీ ఆట్మాస్, హై ఎండ్ ఏఐ ఇంజనీరింగ్‌తో రీ క్రియేట్ చేశారు.

నాగార్జున విలన్‌గా నటించిన ‘కూలీ’చిత్రం ఆగస్టు 14న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో పాటు థియేటర్స్‌లో ‘శివ’రీ రిలీజ్‌ టీజర్‌‌ను ప్రదర్శించబోతున్నారు.

ఈ రీ రిలీజ్ గురించి నాగార్జున మాట్లాడుతూ ‘‘నన్ను ఐకానిక్ హీరోగా నిలబెట్టిన చిత్రం ‘శివ’. ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. నేను, మా అన్నయ్య వెంకట్‌ కలిసి దీన్ని గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నాం. అందుకే డాల్బీ ఆట్మాస్ సౌండ్‌తో, 4కే విజువల్స్‌తో మళ్లీ ప్రెజెంట్ చేస్తున్నాం’అని చెప్పారు.

దర్శకుడు ఆర్జీవీ మాట్లాడుతూ ‘శివ’రీ రిలీజ్ చేయాలనుకోవడం థ్రిల్ ఇచ్చింది.  ఒరిజినల్ సౌండ్‌కు అప్పట్లో చాలా ప్రశంసలు వచ్చాయి. అయితే ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్టుగా అడ్వాన్స్‌ డ్ ఏఐ టెక్నాలజీతో, మోనో మిక్స్‌ను డాల్బీ ఆట్మాస్‌కి మార్చాం.

గతంలో చూసిన వాళ్లకు కూడా ఈ సౌండ్‌ కొత్త ఎక్స్‌ పీరియన్స్‌ను ఇస్తుంది’అన్నారు. మొదట తెలుగులో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసి, ఆ తర్వాత తమిళ, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.