పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో నాగార్జున సాగర్

పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో నాగార్జున సాగర్

నల్గొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి ఇన్ ఫ్లో భారీగా ఇన్ ఫ్లో వస్తుండటంతో సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువైంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,81,445 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 41,028 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 582.70 అడుగులకు చేరింది. సాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా ప్రస్తుతం 290.82 టీఎంసీలుగా ఉంది.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో గురువారం ఉదయం 6.30 గంటలకు అధికారులు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.