నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం

నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం

ఇటీవల ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగశౌర్య.. తాజాగా తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.అరుణాచలం దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాని ఆదివారం రామానాయుడు స్టూడియోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రారంభించారు. చింతలపూడి బ్రదర్స్ శ్రీనివాసరావు , విజయ్ కుమార్, డా.అశోక్ కుమార్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచాన్ చేశారు. కిషోర్ తిరుమల గౌరవ దర్శకత్వం వహించారు.

‘యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలగలిసిన యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దీన్ని రూపొందిస్తున్నామని, నాగశౌర్య డిఫరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తాడని దర్శకనిర్మాతలు తెలియజేశారు. హారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జయరాజ్ సంగీతం, వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే అనౌన్స్ చేస్తామన్నారు.