శ్రీవారి భక్తులకు అలర్ట్: తిరుమలలో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం..

శ్రీవారి భక్తులకు అలర్ట్: తిరుమలలో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం..

తిరుమలలో భారీ వర్షం కురిసింది. సోమవారం ( జూన్ 1 ) సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కుండపోతగా కురిసిన వర్షానికి తిరుమలలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో దర్శనానికి వెళ్లే భక్తులు, దర్శనం అయ్యాక బయటికి వచ్చిన భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యి షెడ్ల కింద తలదాచుకున్నారు.

భారీగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తింది. షాపులలో సరుకు కూడా తడిసిపోవడంతో దుకాణదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తమకు భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు షాపుల యజమానులు.

మరో వైపు అలిపిరి నడక మార్గంలో మెట్ల నుండి వర్షపు ఉదృతంగా ప్రవహిస్తున్న క్రమంలో భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఘాట్ రోడ్లలో అక్కడక్కడా బండరాళ్లు విరిగిపడే అవకాశం ఉన్న క్రమంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది టీటీడీ.