జూన్ నెల వచ్చేసింది.. ఎండలతో పాటే సామాన్యుల జేబులకు చిల్లులు పెట్టేలా, అలాగే కొన్ని ఊరటనిచ్చేలా సరికొత్త రూల్స్ మోసుకొచ్చేసింది. అవును జూన్ 1 నుంచే మంత్లీ బడ్జెట్, రోజువారీ లైఫ్, డిజిటల్ పేమెంట్స్‌పై డైరెక్ట్ ఇంపాక్ట్ చూపించే 10 ముఖ్యమైన మార్పులు అమలులోకి వచ్చాయి. ఇవి మీ జేబుపై భారాన్ని పెంచబోతున్నాయా? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
1. యూపీఐలో రియల్ నేమ్:
డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి ఇదొక సూపర్ గుడ్ న్యూస్. ఇకపై మీరు ఫోన్ పే, గూగుల్‌పే లలో ఎవరికైనా మనీ పంపేటప్పుడు.. సదరు వ్యక్తి, మర్చంట్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న అఫీషియల్ పేరు స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీనివల్ల పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపే ఛాన్స్ ఉండదు. అలాగే ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట పడుతుంది.
2. కమర్షియల్ LPG సిలిండర్ల ధర పెంపు:
హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులకు గ్యాస్ కంపెనీలు షాకిచ్చాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లతో పాటు 5 కేజీల సిలిండర్ల ధరలను పెంచాయి. అయితే సామాన్యులకు ఊరటనిస్తూ 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
3. కొత్త కారు కొనడం మరింత కాస్ల్టీ:
జూన్ నెలలో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవాల్సిందే. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలు మారుతీ సుజుకి కొన్ని మోడళ్లపై రూ.30వేల వరకు పెంచుతోంది. ఇదే క్రమంలో హ్యుందాయ్ మోటార్స్ తమ వాహనాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
4. పెరిగిన పాల ధరలు:
నిత్యావసరాల్లో కీలకమైన పాల ధరలు కూడా పెరిగాయి. కేరళాలో ప్రముఖ డైరీ బ్రాండ్ 'మిల్మా' లీటర్ పాలపై రూ. 4 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది లక్షలాది కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం చూపించనుంది.
5. పెద్ద యూపీఐ ట్రాన్సాక్షన్స్ డబుల్ సేఫ్:
ఆన్‌లైన్ మోసాలను ఆపడానికి రిజర్వు బ్యాంక్ సరికొత్త సెక్యూరిటీ చెక్స్ తీసుకొచ్చింది. ఇకపై పెద్ద మొత్తంలో డిజిటల్ పేమెంట్స్ చేసేటప్పుడు ఫింగర్‌ప్రింట్, ఫేస్ ఐడీ, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి అవుతోంది. దీంతో మీ డబ్బుకు మరింత భద్రత రానుంది.
6. విమాన సర్వీసుల తగ్గింపు.. పెరగనున్న ఛార్జీలు:
దేశీయ ఏవియేషన్ కంపెనీలైన ఎయిర్ ఇండియా, ఇండిగో రాబోయే 3 నెలల పాటు కొన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించాయి. సర్వీసులు తగ్గడం వల్ల డిమాండ్ పెరిగి, కొన్ని రూట్లలో విమాన టికెట్ల ధరలు బాగా పెరిగే అవకాశం ఉంది.
7. పాన్ కార్డ్ రూల్స్‌లో మార్పులు:
ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం పాన్ కార్డ్ రూల్స్ సవరించింది. కొన్ని చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ కి ఇకపై పాన్ అవసరం లేదు. కానీ పెద్ద ఆస్తుల కొనుగోళ్లు, హై-వాల్యూ ట్రాన్సాక్షన్స్ కి మాత్రం పాన్ తప్పనిసరి.
8. సోలార్ ప్యానెల్స్ కొనుగోలుపై కఠిన రూల్స్:
ప్రభుత్వ సబ్సిడీ సోలార్ ప్రాజెక్టుల కోసం ఇకపై అనుమతించబడిన వెండార్లు, మోడళ్ల జాబితాలో ఉన్న క్వాలిటీ సోలార్ మాడ్యూల్స్, సెల్స్ మాత్రమే వాడాలి. దీనివల్ల క్వాలిటీ పెరుగుతుంది. అయితే ధరలు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది.
9. రైల్వే ప్రయాణికులకు అలర్ట్:
ఇండియన్ రైల్వేస్ పలు రూట్లలో ట్రాక్ అప్‌గ్రేడ్, టెక్నికల్ పనులు చేపడుతోంది. దీనివల్ల జూన్ నెలలో చాలా రైళ్లను వేరే రూట్లలో మళ్లించనున్నారు. కొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేశారు. కాబట్టి జర్నీ చేసేముందు ట్రైన్ స్టేటస్ చెక్ చేసుకోవడం బెటర్.
10. అడ్వాన్స్ టాక్స్ రెడీ చేసుకోండి:
రూ.10వేల కంటే ఎక్కువ పన్ను కట్టాల్సిన టాక్స్ పేయర్స్ అందరూ తమ మొదటి విడత అడ్వాన్స్ టాక్స్‌ని జూన్ 15 లోగా డిపాజిట్ చేయాలి. లేదంటే పెనాల్టీలు, వడ్డీలు కట్టాల్సి వస్తుంది జాగ్రత్త.
