లక్ష ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం.. రెండో విడతలో మరో 2 లక్షల ఇండ్లు.. వారికే తొలి ప్రాధాన్యం

లక్ష ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం.. రెండో విడతలో మరో 2 లక్షల ఇండ్లు.. వారికే తొలి ప్రాధాన్యం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. 2026 జూన్ 01న కొమురం భీం జిల్లాలో పర్యటించిన సీఎం.. కోలామ్ ఆదివాసీ బిడ్డల ఇందిరమ్మ గృహప్రవేశాలు చేయించారు. కొత్తగూడలో 25 ఇండ్ల సామూహిక గృహ ప్రవేశాల సందర్భంగా.. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇండ్ల గృహ ప్రవేశాన్ని ప్రారంభించారు. 

కోలామ్ ఆదివాసీలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిన విషయం తెలిసిందే. గృహ ప్రవేశం సందర్భంగా కొత్త ఇందిరమ్మ ఇంట్లో ఆదివాసీలతో కలిసి ఇప్పపువ్వు లడ్డు తిన్నారు సీఎం. గృహ ప్రవేశం సందర్భంగా ఆడబిడ్డలకు పట్టు బట్టలు గిప్ట్ ఇచ్చారు సీఎం. ఈ సందర్భంగా రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టారు సీఎం.

ఈ సందర్భంగా  రూ.112.14 కోట్లతో అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు. చింతల మానేపల్లిలో 132/3 కేవీ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు.కాగజ్ నగర్ మున్సిపాలిటీలో 18 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కలెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ స్పీచ్:

  • నియోజవర్గానికి 3 వేల 500 ఇండ్ల చొప్పున మొదటి విడత 4 లక్షల 50 వేల ఇండ్లు ఇచ్చాం
  • ఆ లెక్కన ఇస్తే గూడేలలో ఉన్న ఆదివాసీలకు అందరికీ ఇవ్వలేమనే అభ్యర్థన వచ్చింది.
  • ఆదివాసీ ప్రాంతానికి, గూడేలలో ఉన్న ఆదివాసీలు నివసించే ప్రాంతంలో ప్రత్యేకంగా 21 వేల ఇండ్లు ఇవ్వడం జరిగింది.
  • రాష్ట్రస్థాయిలో ఇచ్చిన 4 లక్షల 500 ఇండ్లు కాకుండా.. గూడేలకు ప్రత్యేకంగా 21 వేల ఇండ్లు
  • ఈ సందర్భంగా మళ్లీ కొత్త సంకల్పం తీసుకుంటున్నాం
  • రాష్ట్రం మొత్తం లో ప్రారంభించే ఇండ్లకు ఆదివాసీ ప్రాంతం నుంచే లక్ష ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం
  • మళ్లీ అదనంగా రెండున్నర లక్షల ఇండ్లు ఇచ్చేందుకు ఈ ప్రాంతంనుంచే శ్రీకారం చుడుతున్నాం
  •  లక్షల 50 వేల ఇండ్లకు అదనంగా రెండో విడతలో మరో రెండు లక్షల ఇండ్లు
  • మొదటి ప్రాధాన్యత ఆదివాసీ గూడేలలో గుడెసెల్లో ఉన్నోళ్లకు, లంబాడీ తండాల్లో ఉన్న గుడిసెల్లో ఉన్న వాళ్లకే ఇండ్లు ఇవ్వాలి