సెప్టెంబర్ 29న ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి బాధ్యతల స్వీకరణ

సెప్టెంబర్ 29న ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి ఈ నెల 29న సోమవారం బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు ఎండీగా ఉన్న సజ్జనార్ సిటీ పోలీసు కమిషనర్ గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఫైర్ సేఫ్టీ డీజీగా ఉన్న నాగిరెడ్డిని ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం శనివారం నియమించింది. సజ్జనార్ నాలుగేండ్ల పాటు ఆర్టీసీ ఎండీగా పనిచేసి తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. 

ఉద్యోగులకు ఒకటో తేదీనే  జీతాలు చెల్లించడం, సంస్థ టర్నోవర్ ను 10 వేల కోట్లకు తీసుకు వెళ్లడంలో కీలకమైన పాత్రను పోషించారు. ఇక ఆర్టీసీలో యూనియన్లకు గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్, మహాలక్ష్మీ పథకం అమలు, ఆదాయం పెంపు వంటి వాటిపై కొత్తగా రానున్న నాగిరెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టాల్సి ఉంది.