గోళ్ల ఆరోగ్యానికి .. 

V6 Velugu Posted on Oct 04, 2021

డిఫరెంట్ నెయిల్​ షేప్స్​ చూడ్డానికి అట్రాక్టివ్​గా ఉంటాయి. కానీ, గోళ్లకి మాత్రం చాలా నష్టం చేస్తాయి. గోళ్లు విరగ డానికి, పెళుసుగా మారడానికి నెయిల్ షేప్సే కారణం. అందుకే  తరచూ నెయిల్స్​ని షేప్​ చేయకూడదు. వేరే నెయిల్​ షేప్స్​తో పోలిస్తే రౌండ్ షేప్​ వల్ల నష్టం తక్కువ. అలాగే కొందరు గోళ్లని అస్తమానం కొరుకు తుంటారు. మరికొందరు  ఇష్టం వచ్చినట్టు కత్తిరిస్తుంటారు.  దానివల్ల గోళ్లు అందంగా కనిపించవు. అలాగే   కెమికల్స్‌ తక్కువగా ఉండే నెయిల్​ పాలిష్​లే వాడాలి. ఎక్కువ సార్లు గోళ్ల రంగులను మార్చిమార్చి వేయ
కూడదు.  గోళ్లతో డబ్బా మూతలు  తీయొద్దు.  అలాగే  మానిక్యూర్ చేయించే టప్పుడు ఒకదానికి మరొకదానికి ​ కనీసం పదిహేను రోజుల గ్యాప్​ ఉండాలి.  గోర్లు, గోరు చుట్టూ ఉండే పోర్స్ నీళ్లని త్వరగా లాగేస్తాయి. అందుకని పనులు పూర్తయిన వెంటనే 
తడి లేకుండా గోళ్లని శుభ్రంగా తుడవాలి . 

Tagged health, life style, , Nail, shapes

Latest Videos

Subscribe Now

More News