ఓటేసిన మంత్రి నిరంజన్ రెడ్డి, ఉత్తమ్, కోమటి రెడ్డి

ఓటేసిన మంత్రి నిరంజన్ రెడ్డి, ఉత్తమ్, కోమటి రెడ్డి

పొద్దున ఏడు గంటల నుంచి మున్సిపల్ ఓటింగ్ మొదలైంది. సాయంత్రం ఐదు గంటలవరకు జరుగనున్న ఓటింగ్ లో ఇప్పటికే పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు లైన్లు కట్టారు. వీరితో పాటు పలువురు నాయకులు ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 44వ వార్డు పరిధిలోని నెహ్రూ నగర్ సిద్దార్ధ హైస్కూలులో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు మంత్రి.

వనపర్తి 23 వ వార్డులోని  బాయ్స్ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో తన హక్కును వినియోగించుకుంటున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోని ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయాలని అన్నారు.

కోదాడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విచ్చలవిడిగా లిక్కర్, మనీ పంపిణీ చేసిందని ఆరోపించారు ఉత్తమ్. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా… కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని ఆయన  చెప్పారు. వీరితో పాటు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఓటేశారు.

వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి… 29 వ వార్డు లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్క మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

మరిన్ని వార్తలు..

కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్!

ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పు ఇచ్చే.. హెల్త్‌‌ లోన్​ కార్డ్‌‌ 

రెండేళ్ల పిల్లాడికి 102 ఏళ్లు.. నాలుగేళ్ల పిల్లాడికి 104 ఏళ్లు

‘కరోనా’ వైరస్‌… ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది