
నల్లబెల్లి, వెలుగు: వరంగల్ జిల్లా నల్లబెల్లి ఎస్సై అఫీషియల్ సెల్ నంబర్‌నే సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడం కలకలం రేపింది. ఎస్సై గోవర్ధన్ స్వయంగా వివరాలు వెల్లడించారు. నల్లబెల్లి ఎస్సైకు గవర్నమెంట్ కేటాయించిన నంబర్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి కాల్ డైవర్ట్ చేసుకున్నారు.
వివిధ సమస్యలపై వచ్చే ఫోన్ కాల్స్ సైతం ఎస్సైకు రాకుండా సైబర్ నేరగాళ్లకే వెళ్లాయి. 8712685233 నంబర్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లను రిసీవ్ చేసుకోవద్దని ఎస్సై కోరారు. మండల ప్రజలు వాట్సాప్ మెసేజ్, ఏపికే ఫైల్స్ వస్తే ఓపెన్ చేయవద్దని సూచించారు.