దుండిగల్ నల్లపోచమ్మ గుడిలో.. అమ్మవారి విగ్రహం ధ్వంసం, ఆభరణాలు చోరీ

దుండిగల్  నల్లపోచమ్మ గుడిలో.. అమ్మవారి విగ్రహం ధ్వంసం, ఆభరణాలు చోరీ

 తెలంగాణలో ఈ మధ్య హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయి. గుడిలో విగ్రహాలను ధ్వంసం చేసి చోరీ చేస్తున్నారు. లేటెస్ట్ గా నవంబర్ 13న  దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్ పల్లి కాకతీయకాలనీలో నల్లపోచమ్మ గుళ్లో గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు. 

అర్ధరాత్రుల్లో గుడి తాళాలు పగలగొట్టి గుళ్లో ఉన్న అమ్మవారి చీరలు, హుండీ డబ్బులు ఎత్తుకెళ్లడమే కాకుండా అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అమ్మవారి నగలు రోల్డ్ గోల్డ్ అని గ్రహించిన దుండగులు ఆభరణాలను గుడి ఆవరణలో చెల్లాచెదురుగా పడేసి విద్వంసం సృష్టించారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలంలో ఫింగర్ ప్రింట్  సహయంతో క్లూస్ టీంను రంగంలోకి దించి దర్యాప్తు చేస్తున్నారు.

కీసర పోలీస్ స్టేషన్ పరిధి రాంపల్లిలో శనివారం రాత్రి సీతా రామాంజనేయ దేవాలయం పక్కన గల హనుమాన్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. శనివారం స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించారు