నల్గొండ, వెలుగు: నల్గొండ పట్టణ అభివృద్ధి దిశగా టూరిజం రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. గురువారం నల్గొండ పట్టణంలో శ్రీవెంకట రమణ హోటల్ గ్రాండ్ ను త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి గుత్తా సుఖేందర్రెడ్డి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పర్యాటక రంగం ఒక ప్రముఖ పరిశ్రమగా మారిందని, గ్రామీణ స్థాయిలో హోం స్టేలు, గెస్ట్ రూమ్‌లు ఏర్పాటు చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సూచించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఇలాంటి ప్రాజెక్టులు కీలకమని, త్వరలో పట్టణంలో స్టార్ హోటల్ నిర్మించేలా వ్యాపారవేత్తలు ముందుకు రావాలని కోరారు.
