కారెక్కినా.. సైకిల్ మర్చిపోలేకపోతున్న నామా

కారెక్కినా.. సైకిల్ మర్చిపోలేకపోతున్న నామా

ఖమ్మం లోక్ సభ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న నామా నాగేశ్వర రావు ఈ రోజు రోడ్ షోలో మాట్లాడుతూ.. సైకిల్ గుర్తుకే ఓటేయమని నాలుక్కరుచుకున్నారు.   దీంతో రోడ్ షోలోని ప్రజలు పెద్దగా నవ్వుకున్నారు. నామా కూడా తాను అన్న దానికి సిగ్గుతో నవ్వుకున్నారు. ఆపై.. కారుగుర్తుకే మన ఓటు..కేసీఆర్ జిందాబాద్ అంటూ ప్రసంగాన్ని ముగించారు.

కేరీర్ మొదటి నుంచి ఒకే పార్టీ లో ఉన్న నాయకులు.. సడన్ గా వేరే పార్టీలో జాయిన్ అవడంతో.. పాత గుర్తులను.. ఆ పార్టీని మర్చిపోలేక పోతున్నారు. పైగా.. పబ్లిక్ మీటింగ్స్ లో గత పార్టీ జ్ఞాపకాలను అనుకోకుండా గుర్తు చేసుకుంటున్నారు. ఈ చర్యలు జనాన్ని నవ్వించేలా మారుతున్నాయి.  ఇలాంటి తప్పిదాన్నే..  అప్పటి మల్కాజ్ గిరి ఎంపీ..  ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఇలాగే ఓ సభలో టీడీపీకి జిందాబాద్ అని అన్నారు. అప్పటికే ఆయన టీడీపీని వదిలి టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు.