నమ్మ యాత్రి యాప్ రాకతో క్యాబ్ సర్వీసులకు ముప్పు తప్పదా..?

నమ్మ యాత్రి యాప్ రాకతో క్యాబ్ సర్వీసులకు ముప్పు తప్పదా..?

బెంగుళూరులోని ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ నమ్మ యాత్రి యాప్‌ను ప్రారంభించింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆటో డ్రైవర్లతో ప్రయాణికులను అనుసంధానం చేసేలా ఈ యాప్ రూపొందించబడింది. రీసెంట్ డేస్ లో ఓలా, ఉబర్‌లు ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శల నేపథ్యంలో బెంగుళూరులోని ఓ ఆటో యూనియన్ నమ్మ యాత్రిని తీసుకొచ్చినట్టు సమాచారం. రూ.100 బేస్ ఫేర్‌గా ఇప్పటికే నిర్ణయించారు. అదనంగా రూ.10 నుంచి రూ.30 వసూలు చేసే అవకాశమూ ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ యాప్ ను నవంబర్ 1న అధికారికంగా ప్రారంభించారు. కానీ అంతకుముందే టెస్టర్ల ద్వారా 10,000 కంటే ఎక్కువ డౌన్‌లోడ్ లు జరిగినట్టు సమాచారం. 

ఇక పికప్ లోకేషన్, డ్రాపింగ్ లొకేషన్ లు మిగతా యాప్స్ లో వలే ఉండనున్నాయని సమాచారం. ఓలా, ఉబర్ లాంటి యాప్స్ లో మాదిరిగానే ఓటీపీ ఓకే చేశాకే జర్నీ స్టార్టవుతుందని యాప్ నిర్వాహకులు తెలిపారు. సామాన్యునికి అత్యంత చౌకగా ఈ యాప్ సౌలభ్యంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అదే గనక నిజం అయితే ఇప్పుడున్న క్యాబ్ సర్వీస్ యాప్ లకు ఈ యాప్ భారీ ముప్పు తప్పదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.