నాంపల్లి కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆత్మహత్య

నాంపల్లి కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఈరోజు(2024 మార్చి 24 ఆదివారం) ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్ పేట బతుకమ్మ కుంటలోని పోచమ్మ బస్తీలో శ్రీనిధి రెసిడెన్సీలో నివాసముండే మెజిస్ట్రేట్ మణికంఠ(36) ఇంట్లో సీలింగ్ ఫ్యాన్స్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘట్ కేసర్ మండలం ముత్తువెల్లి గ్రామానికి చెందిన మణికంఠ నాంపల్లి కోర్టులో స్పెషల్(JFCM) ఫర్ ఎక్సైజ్ కేసెస్ సంబంధించి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గా పనిచేస్తున్నారు. 

మణికంఠ ఏడు సంవత్సరాల క్రితం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రానికి చెందిన లలితతో వివాహం కాగా.. రెండు సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ వివాదాలతో కొంతకాలం నుంచి మణికంఠ భార్య లలిత పుట్టింట్లోనే ఉంటోంది. లలితతో జరిగిన మనస్పర్ధలు కారణంగానే మణికంఠ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.