
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ అందరికీ సుపరిచితమే. మిస్ ఇండియాగా నేషనల్ వైడ్ ఫేమస్ అయింది. ఆ తర్వాత హీరోయిన్, నిర్మాతగా తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తోంది. నమ్రతా చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో ఫ్యామిలీ పోస్టులు పెడుతూ నెటిజన్లను ఆకర్షిస్తుంటోంది.
ఈ క్రమంలో లేటెస్ట్గా మిస్ ఇండియా నమ్రతా త్రోబ్యాక్ ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్లో షేర్ చేసింది. గురువారం (2025 ఏప్రిల్ 10న) సిబిలింగ్స్ డే ( తోబుట్టువుల దినోత్సవం) సందర్భంగా తన చెల్లెలు శిల్ప శిరోద్కర్తో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంది. 'మై ఫేవరేట్ పర్సన్ ఇన్ మై లైఫ్' అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఒక్క పోస్ట్తో తన చెల్లిపై ఉన్న ప్రేమను చూపేంచేసింది.
శిల్ప కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో నమ్రతతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. 'సిబ్లింగ్స్ డే శుభాకాంక్షలు, నా ప్రియమైన చింటుక్లి (నమ్రతా శిరోద్కర్) నువ్వే నా అతిపెద్ద సపోర్ట్ సిస్టమ్, నా బెస్ట్ ఫ్రెండ్ మరియు నా రాక్! లవ్ యు' అంటూ ఫోటోలకు శిల్ప క్యాప్షన్ ఇచ్చింది.
ఈ ఫొటోల్లో నమ్రత, శిల్ప సాంప్రదాయకమైన పద్దతిలో కనిపించారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నమ్రత సిస్టర్ శిల్పా శిరోద్కర్ ఇటీవలే హిందీ బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టింది. ఆ షోలో తన ఆట తీరుతో టాప్ 5లో నిలిచి మరింత ఫేమస్ అయింది.
నమ్రతా శిరోద్కర్ విషయానికి వస్తే:
‘వంశీ’ సినిమాలో మహేష్,నమ్రతాలు ఆన్ స్క్రీన్ జోడీగా చేశారు. ఆ తర్వాత నిజజీవితంలో కూడా ఒక్కటైయ్యారు. 1993లో ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న నమ్రత 2000లో ‘వంశీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
►ALSO READ | Manchu Manoj: ‘దొంగప్ప’ అంటూ మనోజ్ సెటైరికల్ పోస్ట్.. కమిషన్ నొక్కేసాడంటూ సంచలనం
ఆ తరువాత ‘అంజి’తో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించారు. ‘వంశీ’ సినిమా సమయంలో మహేశ్, నమ్రత ప్రేమించుకున్నారు. 2005లో ఇద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. వివాహం అనంతరం నమ్రత సినిమాలకు గుడ్ బై ,చెప్పింది. వీరికి గౌతమ్,సితార ఇద్దరు పిల్లలు ఉన్నారు.