ప్రముఖ  నటుడు నందమూరి తారకరత్న మరణాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని నందమూరి బాలకృష్ణ అన్నారు. బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నానన్నారు. నందమూరి అభిమానులకు, టీడీపీ కుటుంబసభ్యులకు తారకరత్న మరణం తీరని లోటని చెప్పారు. నటనలోనూ తనకు తాను నిరూపించుకున్నాడని అన్నారు. కఠోరంగా మృత్యువుతో పోరాడుతున్నప్పుడు మృత్యుంజయుడై తిరిగి వస్తాడని అనుకున్నానని కాని.. తారకరత్న ఇక కానరాని లోకాలకు వెళిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. తారతరత్న ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని నందమూరి బాలకృష్ణ కోరుకున్నారు.  
 
