
ఓ వైపు ‘అఖండ’ బ్లాక్ బస్టర్, మరోవైపు ‘అన్‌స్టాపబుల్’ షో సక్సెస్‌తో జోష్ మీదున్న బాలకృష్ణ.. కొత్త సినిమా షూటింగ్‌కు రెడీ అవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నటించబోయే సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల పన్నెండు నుంచి స్టార్ట్ కానుంది. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో బాలకృష్ణ ట్రిపుల్ రోల్‌లో కనిపించనున్నారంటూ ఓ ఇంటరెస్టింగ్ అప్‌డేట్ బైటికొచ్చింది. ‘అఖండ’తో సహా చాలా సినిమాల్లో ఆయన డ్యూయెల్ రోల్ చేసి మెప్పించారు. అయితే మూడు పాత్రల్లో నటించి మాత్రం పదేళ్లవుతోంది. ‘అధినాయకుడు’లో మూడు పాత్రల్లో కనిపించిన బాలకృష్ణ మళ్లీ ఇన్నాళ్లకి అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారట. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో నటించనున్నారాయన. మరిన్ని సినిమాల్ని కూడా లైన్‌లో పెడుతున్నారు. త్వరలో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లోనూ నటించే అవకాశాలున్నాయి. ఇటీవల స్టోరీ డిస్కషన్స్ జరిగినట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ మూవీస్ మాత్రమే చేస్తాడనే ఇమేజ్‌ను ‘నారప్ప’తో చెరిపేసుకుని, యాక్షన్ మూవీస్‌పై కూడా ఫోకస్ పెట్టిన శ్రీకాంత్.. బాలకృష్ణతో ఎలాంటి సినిమా తీస్తాడో!