
సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో ‘అఖండ’ చిత్రం రూపొందుతోంది. ఈ మాస్ కాంబోపై ఇప్పటికే బజ్ క్రియేటయ్యింది. షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్న సమయంలో ఒక గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. షూటింగ్ కంప్లీట్ అయ్యిందని, త్వరలోనే థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో తీసిన సాంగ్‌తో మొత్తం షూటింగ్ పూర్తయిందట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, అతి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో బాలయ్య చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. ఇంతకు ముందెన్నడూ చూడనంత కొత్తగా, రెండు డిఫరెంట్ గెటప్స్‌లో ఆయన ఈ సినిమాలో కనిపిస్తారట. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. పూర్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.