కర్ణాటకలో నందిని పాల ధర లీటరుకు 3 రూపాయలు పెంచుతూ సిద్ధరామయ్య సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. అటు పాల ఉత్పత్తుల ధరలు కూడా స్పల్పంగా పెరుగనున్నాయని కర్ణాటక పాల సమాఖ్య ఉన్నతాధికారి చెప్పారు.
పశుగ్రాసం ధరలతో పాటు రవాణా చార్జీలు పెరగడంతో మిల్క్ రేట్ ధర లీటరకు కనీసం 5 రూపాయల మేర పెంచాలని పాల సమాఖ్య సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మరోవైపు పెంచిన పాల ధర నిత్యవసర సరకులపై ఎఫెక్ట్ చూపుతుందని స్థానికులు అంటున్నారు. ఏకంగా లీటరు ధర 3 రూపాయలు పెంచటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలపై భారం పడుతుందన్న ఉద్దేశ్యంతోనే లీటరు పాలపై 3 రూపాయలు పెంచేందుకు అనుమతి ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.