
హైదరాబాద్, వెలుగు: టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్యూటర్లను కంపెనీ డీలర్‌షిప్ అయిన నానేష్ ఆటోమోటివ్స్ సోమవారం లాంచ్ చేసింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ దేవాశిష్ మిశ్రా పాల్గొన్నారు. టీవీఎస్ ఐక్యూబ్,ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్‌టీ వేరియంట్లను ఆయన లాంచ్ చేశారు. మొదటి రెండు వేరియంట్లు ఫుల్ ఛార్జింగ్‌పై రూ. 100 కి.మీ వరకు వెళతాయి. టాప్ వేరియంట్ అయిన టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ 140 కి.మీ వెళుతుందని నానేష్ ఆటోమోటివ్స్ పేర్కొంది. ఐక్యూబ్, ఐక్యూబ్ ఎస్ వేరియంట్ల టాప్ స్పీడ్ గంటకు 78 కి.మీ కాగా, ఎస్‌టీ వేరియంట్ ధర రూ. 82 కి.మీ. వీటి రేట్లు రూ. 1,08,556 నుంచి స్టార్టవుతున్నాయి. ఈ రేటులో ఫేమ్ కింద ఇచ్చే సబ్సిడీ కలిసి ఉంటుంది.