
నేచురల్ స్టార్ నాని(Natural star Nani) హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ హాయ్ నాన్న(Hi Nanna). కొత్త దర్శకుడు శౌర్యూవ్(Shouryuv) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీతరామమ్(Sitaramam) ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal thakru) హీరోయిన్ గా నటిస్తోంది. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ బ్యాక్డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్ అండ్ సాంగ్స్ కు కూడా ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.
ఇందులో భాగంగానే నేడు(అక్టోబర్ 15) హాయ్ నాన్న టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ చాలా ఫ్రెష్ గా ప్లెసెంట్ గా ఉంది. తండ్రి, కూతురు ఎమోషనల్ బాండింగ్ తో మొదలైన ఈ టీజర్ ఆద్యాంతం ఆకట్టుకుంది. ఆ తర్వాత హీరోయిన్ మృణాల్ ఎంట్రీ, నానికి ఆమెకు మధ్య ప్రేమ, లిప్‌లాక్ సీన్స్ తో మూవీపై ఆసక్తిని పెంచారు మేకర్స్. పెళ్ళై కూతురున్న వ్యక్తితో హీరోయిన్ ప్రేమలో పడటం, తరువాత విడిపోవడం, చివరికి నాని మృణాల్ కు లవ్ ప్రపోజ్ చేయడం వంటివి ఆసక్తికరంగా ఉన్నాయ్. ఇక ఈ టీజర్ కు హేషామ్ అబ్దుల్ వాహాబ్ అందించిన సంగీతం నెక్స్ట్ లెవల్లో ఉంది. ఒక ఎమోషనల్ అండ్ ప్లెజెంట్ ఫిలిం కూడా అంతే సోల్ఫుల్ మ్యూజిక్ అందించాడు హేషామ్.
ఈ టీజర్ తో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను ఇంకా పెంచేశారు మేకర్స్. ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని హాయ్ నాన్నతో మరో సూపర్ హిట్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి హాయ్ నాన్న సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకోనుందో.