Saripodhaa Sanivaaram - Not a Teaser: సరితూగే సమరమే..సరిపోదా శనివారం గ్లింప్స్.. గూస్బంప్స్

Saripodhaa Sanivaaram - Not a Teaser: సరితూగే సమరమే..సరిపోదా శనివారం గ్లింప్స్.. గూస్బంప్స్

నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram). దర్శకుడు వివేక్ ఆత్రేయ(Vivek Athreya) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మొహనన్ (Priyanka Mohanan) హీరోయిన్ గా నటిస్తున్నారు. దీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ నటుడు SJ సూర్య కీ రోల్ చేస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా నుంచి 'నాట్ ఏ టీజర్' అంటూ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. నేడు స్టార్ యాక్టర్  అండ్ డైరెక్టర్ SJ సూర్యకు బర్త్డే విషెష్ చెబుతూ..‘దిస్ ఈజ్ నాట్ ఏ టీజర్’ అంటూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. నాని వాయిస్‌ ఓవర్‌లో వచ్చే వీడియో చాలా పవర్ ఫుల్ గా ఉంది. అంతే పవర్ ఫుల్ గా నాని చెప్పే డైలాగ్ కూడా అదిరిపోయింది. ‘నీడలాంటి చెడు ఎప్పుడైతే బలపడుతుందో, దానిని ఆపడానికి కొన్ని సమానంగా లేదా మరింత శక్తివంతంగా మంచి పుడుతుంది’. ఈ మాత్రం శక్తి లేని సామాన్య వ్యక్తులపై తన ఆధిపత్యాన్ని చూపిస్తూ..సైకో ఆనందాన్ని పొందే క్రూరమైన పోలీసుగా SJ సూర్యను పరిచయం చేశారు. శ్రీకృష్ణుడు (నాని) తన సత్యభామ (ప్రియాంక మోహన్)తో కలిసి రావణాసురుడు (SJ సూర్య)ను ఎదుర్కోవడానికి వస్తాడని అర్ధం వచ్చేలా కట్ చేసిన టీజర్ స్టార్టింగ్ నుండి చివరి వరకు గూస్బంప్స్ అనిపిస్తుంది. 

ఒక్కమాటలో చెప్పాలంటే..పోలీస్ ఆఫీస‌ర్‌కు, ఒక కామ‌న్ మ్యాన్‌కు మ‌ధ్య జరిగే పోరాటం నేప‌థ్యంలో యాక్ష‌న్ అంశాల‌తో ఈ వీడియో గ్లింప్స్‌ ఆక‌ట్టుకుంటోంది. భాగ‌వ‌తం క‌థ‌తో నాని వాయిస్ ఓవ‌ర్ ద్వారా ఎస్‌జే సూర్య పాత్ర‌ను ప‌రిచ‌యం చేయ‌డం చాలా కొత్త‌గా ఉంది. సినిమా రిలీజ్ అయ్యాక ఈ రేంజ్ లో వీరి మధ్య పోరాటం సాగనుందో చూడాలి మరి. 

ALSO READ | Committee Kurrollu Release: నిహారిక కొత్త సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..కమిటీ కుర్రోళ్ళ జాతర ఆ రోజే

ఇక మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. మరి మంచి అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.