కేవలం ప్రభాస్ అన్న కోసమే ఈ నిర్ణయం.. నాని కామెంట్స్ వైరల్

కేవలం ప్రభాస్ అన్న కోసమే ఈ నిర్ణయం.. నాని కామెంట్స్ వైరల్

నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ హాయ్ నాన్న(Hi Nanna). సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్నారు. ఫాథర్ అండ్ డాటర్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను వైరా క్రియేషన్స్ పై మ్హిన చెరుకూరి, కెఎస్ మూర్తి నిర్మిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను డిసెంబర్ చివరివారంలో రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ ప్రభాస్ సాలార్ డిసెంబర్ 22న వస్తుండటంతో.. హాయ్ నాన్న సినిమాను  డిసెంబర్ 7కు ప్రీపోన్ చేసుకున్నారు మేకర్స్. ఇదే విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు. 

తాజాగా హాయ్ నాన్న టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చారు హాయ్ నాన్న టీమ్. అందులో ఒక రిపోర్టర్.. ప్రభాస్ సాలార్ సినిమా వస్తుందని తెలిసి హాయ్ నాన్న సినిమాను ప్రీ పోన్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది అని అడిగారు. దానికి సమాధానంగా నాని.. ఏ ఇంట్లో అయినా పెద్ద అన్నయ్యకు సంబధించిన వేడుక వుంటే.. అప్పుడు చిన్నోడి వేడుకని వాయిదా వేసుకుంటాడు.. ఇది సహజమే. ప్రీపోన్ వాళ్ళ మాకు ఎలాంటి సమస్య లేదు. డిసెంబర్ నెల అంతా లవ్ స్టొరీ, యాక్షన్ సినిమాలతో కళకళలాడుతుంది. అంతకంటే మనకు కావలసింది ఏముంది చెప్పండి.. అంటూ చెప్పుకొచ్చాడు నాని ప్రస్తుతం నాని చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.