Nani: 'ది ప్యారడైజ్' కోసం హాలీవుడ్ స్టార్ ర్యాన్ రేనాల్డ్స్.. టాలీవుడ్‌-హాలీవుడ్ కాంబోపై భారీ హైప్!

Nani: 'ది ప్యారడైజ్' కోసం హాలీవుడ్ స్టార్ ర్యాన్ రేనాల్డ్స్.. టాలీవుడ్‌-హాలీవుడ్ కాంబోపై భారీ హైప్!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్' .  భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన అప్టేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. ఈ మూవీలో హాలీవుడ్ సూపర్ స్టార్ ర్యాన్ రేనాల్డ్స్  నటించినున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అటు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. 

హాలీవుడ్ స్టార్ ఎంట్రీ?

'దసరా ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నానితో శ్రీకాంత్ ఓదేల కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో  ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో చిత్ర బృందం ఉంది. దీంతో హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ రేనాల్డ్స్ ను ప్రజెంటర్ గా చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి సమాచారం.

 'ది ప్యారడైజ్' చిత్రాన్ని "క్విర్కీ ఎలిమెంట్స్‌తో కూడిన యాక్షన్ డ్రామా"గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. ర్యాన్ రేనాల్డ్స్ యాక్షన్ సినిమాలు కూడా ఇంచుమించు ఇలాంటి శైలినే కలిగి ఉండడంతో, ఆయన ఈ సినిమాకు పర్ఫెక్ట్ ఫిట్ అవుతారని చిత్రబృందం బలంగా నమ్ముతోంది. ఈ ప్రయత్నం విజయవంతమైతే, అంతర్జాతీయంగా కూడా మంచి హైప్ ను క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు.

 మూడు నెలలుగా సంప్రదింపులు

గత మూడు నెలలుగా ర్యాన్ రేనాల్డ్స్ టీమ్‌తో 'ది ప్యారడైజ్' మూవీ మేకర్స్ సంప్రదించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. చివరికి ర్యాన్ మేనేజ్‌మెంట్ టీమ్ తో మాట్లాడే అవకాశం దక్కింది. ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.  అంతే కాకుండా ర్యాన్ రేనాల్డ్స్ సొంత నిర్మాణ సంస్థ 'మాక్సిమమ్ ఎఫర్ట్' కూడా నిర్మాణంలో భాగస్వామిగా వస్తే.. ఈ భారతీయ సినిమా ఖ్యాతి అంతర్జాతీయంగా మరింత పెరుగుతుంది.

 మిశ్రమ స్పందనలు

అయితేఈ ప్రకటనపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభిమానులు ఈ గ్లోబల్ ముందడుగు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. ర్యాన్ రేనాల్డ్స్ 'డెడ్‌పూల్' తరహాలో పంచుంటే బాగుంటుంది అని కామెంట్లు చేశారు. మరికొందరు.. ఇది భారతీయ సినీ పరిశ్రమ. హాలీవుడ్ నటుల కంటే మన బిగ్ ఇండియన్ నటులనే ఎంచుకోవాలి అని అభిప్రాయపడ్డారు. దేశీయ మార్కెట్‌ను పూర్తిగా పట్టుకోకుండానే అమెరికన్ మార్కెట్ కోసం ఆరాటపడటంపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఏదేమైనా, 'ది ప్యారడైజ్' చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ తెలుగు తెరకు పరిచయం కానున్నారు. అంతే కాకుండా పవర్ ఫుల్ పాత్రలో మంచు మోహన్ బాబు నటిస్తున్నారు. ఇటీవల ఆయన విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా 2026 మార్చిలో ఏకంగా ఇంగ్లీష్, స్పానిష్ సహా మొత్తం ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. నాని కెరీర్‌లో ఇదొక మైలురాయిగా నిలవడం ఖాయం అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.