
వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ గ్లాస్ మీద వాన చినుకులు పడుతుంటాయి. దాంతో రోడ్డు సరిగ్గా కనిపించదు. ఈ లిక్విడ్‌ని గ్లాస్‌కి అప్లై చేస్తే ఆ సమస్య ఉండదు. దీన్ని వ్యాక్స్‌పోల్ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఈ నానో టెక్ సేఫ్టీ కోటింగ్ వల్ల గ్లాస్ మీద వర్షపు చినుకులు, పొగమంచు, ధూళి, దుమ్ము లాంటివి నిలవవు. పక్షులు రెట్ట వేసినా వెంటనే జారిపడిపోతుంది.
క్లీన్ చేయడం ఈజీ అవుతుంది. ఈ లిక్విడ్ వల్ల గ్లాస్ మన్నిక కూడా పెరుగుతుంది. దీన్ని షవర్ డోర్, కిటీకీలు, వెహికల్స్ అద్దాలు, విండ్‌షీల్డ్ లాంటి వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ 45 ఎంఎల్ రెయిన్ రిపెల్లెంట్‌ను కారు విండ్ షీల్డ్‌పై దాదాపు 15 సార్లు అప్లై చేసుకోవచ్చు.
ధర : 279