సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ రియల్ హీరో : నారా భువనేశ్వరి

సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ రియల్ హీరో : నారా భువనేశ్వరి

ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ నిలిచిపోతాడని నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన బ్లడ్ డోనేషన్ క్యాంపును ఆమె ప్రారంభించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల కీర్తి అని.. సింగిల్ హ్యాండ్తో సమస్యలను పరిష్కరించేవారని చెప్పారు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఆయన రియల్ హీరో అని ప్రశంసించారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడిన మహనీయుడు 

బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడిన మహనీయుడు ఎన్టీఆర్ అని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఎన్టీఆర్ ఒక మహనీయుడు అని కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ప్రాంతాల వారీగా 30 రోజులు పాటు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కాసాని ప్రకటించారు.