వాళ్ల పాపాన వాళ్లే పోతరు

వాళ్ల పాపాన వాళ్లే పోతరు

తిరుపతి: తనపై వ్యాఖ్యలు చేసినవారు వాళ్లపాపాన వాళ్లేపోతారన్నారు నారా భువనేశ్వరి.  సోమవారం తిరుపతిలో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడారు. నోటికొచ్చినట్టు ఆడవాళ్లపై మాట్లాడొద్దని.. నాపై చేసిన వ్యాఖ్యలపై బాధపడ్డా అన్నారు. నా భర్త చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారని.. నన్ను తిట్టినవారు  వాళ్లపాపాన వాళ్లేపోతారని చెప్పారు.  వాళ్ల క్షమాపణ అక్కర్లేదని.. ఇలాంటి వ్యాఖ్యలు పట్టించుకుని టైమ్ వేస్ట్ చేసుకోను  అన్నారు. బాధలో ఉన్న నాకు కుటుంబం అండగా నిలిచిందన్న భువనేశ్వరి.. హెరిటేజ్‍ను ఎవరూ టచ్ చేయలేరన్నారు. నాకు నా భర్త సపోర్ట్ ఉందని.. ఆయన కన్నీరు వెనుక నా పట్ల ప్రేమను చూశా అన్నారు. ఎవరి క్షమాపణ అనవసరం, నా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినపుడు వారం,

 రోజులు తట్టుకోలేక పోయా అన్నారు. మహిళలను కించపరచడం సమాజానికి మంచిదికాదని.. నాపైన జరిగిన దాడికంటే, మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలు దారుణంగా ఉన్నాయన్నారు. నాపై జరిగిన దాడి తర్వాత నాలాగే దాడికి గురవుతున్న మహిళల వ్యథ మరింతగా ఆర్థమైందన్నారు. మహిళ పట్ల జరుగుతున్న అకృత్యాలు బాధాకరమని... ప్రతి వ్యక్తి తన కుటుంబంలోని తల్లి, చెల్లిని ఎలా చూస్తారో సమాజంలోని మహిళను అలాగే చూడాలని తెలిపారు నారా భువనేశ్వరి.