Sundarakanda Teaser: నాది మూలా నక్షత్రం..5 నిమిషాలకు మించి హ్యాపీగా ఉండను: నారా రోహిత్

Sundarakanda Teaser: నాది మూలా నక్షత్రం..5 నిమిషాలకు మించి హ్యాపీగా ఉండను: నారా రోహిత్

ఇటీవల ప్రతినిథి2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నారా రోహిత్(Nara Rohith).. ప్రస్తుతం ‘సుందరకాండ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. విర్తి వాఘని హీరోయిన్‌‌‌‌‌‌‌‌. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. నారా రోహిత్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 20వ చిత్రం. 

తాజాగా సుందరకాండ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. సిద్దార్థ్‌ పాత్రలో నారా రోహిత్‌ టైమింగ్‌తో కామెడీ పండిస్తున్నాడు. ఈ పాత్ర నారా రోహిత్‌ కు కరెక్ట్ గా సెట్టయినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఇందులో ఇన్నోసెంట్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తూ..కూల్ లుక్‌‌‌‌‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. 

పెళ్లి చేసుకునేందుకు సరైన అమ్మాయిని వెతికే అతను కొన్ని ప్రత్యేకమైన లక్షణాలున్న జీవిత భాగస్వామి కావాలని ఆశపడుతుంటాడు. అయితే వివాహయోగ్యంలో ఉండి పెళ్లి కాకపోవడం వల్ల సమాజం నుంచి వచ్చే ఒత్తిడిని, తన తల్లిదండ్రులకు భారంగా ఉన్నట్టు అనిపించే పరిస్థితులను ఎదుర్కొంటాడు. 'నాది మూలా నక్షత్రం.. 5 నిమిషాలకు మించి హ్యాపీగా ఉండను..’ అని నారా రోహిత్ చెప్పే డైలాగ్ అత‌డు ప‌డే క‌ష్టాల‌ను తెలియ‌జేస్తుంది. వ‌య‌సు ఎంత అంటే జ‌ట్టుకు రంగు వేసుకునేంతా అనే డైలాగ్ న‌వ్విస్తోంది. ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తోన్న సుందరకాండ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరోవైపు సీనియర్ నరేశ్‌ తండ్రి పాత్రలో కనిపించగా, శ్రీదేవి విజయ్ కుమార్, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. రోహన్ ఈ సినిమాకు ఎడిటర్‌గా, రాజేష్ పెంటకోట ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.