సర్‌‌‌‌ప్రైజ్ చేసే నరకాసుర

సర్‌‌‌‌ప్రైజ్ చేసే నరకాసుర

‘పలాస’ ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా సెబాస్టియన్ తెరకెక్కించిన చిత్రం ‘నరకాసుర’. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్. డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు.  మంగళవారం  ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ముఖ్య​అతిథిగా హాజరైన నాగశౌర్య మాట్లాడుతూ ‘రక్షిత్ నాకు చిన్నప్పటి స్నేహితుడు. సినిమాలపై ఫ్యాషన్‌‌తో పలాస, నరకాసుర లాంటి కొత్త తరహా, రూరల్ బ్యాక్‌‌ డ్రాప్ మూవీస్ ట్రై చేస్తున్నాడు. అతన్ని ఎంకరేజ్ చేద్దాం. ఓ పెద్ద యాక్సిడెంట్ అవడంతో చేయి కోల్పోయినా ఎంతో పట్టుదలగా ఈ సినిమా పూర్తి చేసిన దర్శకుడు సెబాస్టియన్‌‌కు హ్యాట్సాఫ్’ అని అన్నాడు.

రక్షిత్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్‌‌‌‌లో యాక్షన్ ఎక్కువ కనిపిస్తున్నా, సినిమాలో ఎంటర్‌‌‌‌టైన్మెంట్ కూడా ఉంది’ అని చెప్పాడు. ‘ఎన్నో సర్‌‌‌‌ప్రైజింగ్ ఎలిమెంట్స్, క్యారెక్టర్స్ ఉన్న పవర్‌‌‌‌ప్యాక్డ్ సినిమా ఇది’ అని చెప్పింది సంకీర్తన. కెరీర్‌‌‌‌లో గుర్తుండిపోయే పాత్రను ఇందులో పోషించాను అన్నారు చరణ్ రాజ్. దర్శకుడు మాట్లాడుతూ ‘కంటెట్‌‌తో పాటు ప్రతి సీన్ కొత్తగా ఉంటుంది. నా చిన్నప్పుడు చూసిన ఒక ఇన్సిడెంట్‌‌కు ట్రాన్స్ జెండర్ అంశాన్ని జోడించి ఈ సినిమా చేశా’ అని చెప్పాడు. నిర్మాత అజ్జా శ్రీనివాస్, నటులు సలీమ్ ఫేకు, సుజిత్ తదితరులు పాల్గొన్నారు.