
టాలీవుడ్ హీరో నారా రోహిత్( Nara Rohit) విభిన్న కథ చిత్రాలతో గుర్తింపు పొందారు. బాణం, సోలో, ప్రతినిధి లాంటి మూవీస్ తో తనలోని సహజ నటనను కనబరిచిన నారా హీరో లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత మరో కొత్త మూవీను ప్రకటిస్తూ.. క్యూరియాసిటీని పెంచేలా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.
పోస్టర్లో చేతి చుట్టూ చుట్టబడిన పేపర్ కటింగ్..అందులో దాగున్నా కరెన్సీ రాజకీయ కోణాలు.. ఇలా 'ఒక వ్యక్తి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడతాడు' అంటూ ట్యాగ్ లైన్ తో ఇంటెన్స్ కలిగేలా చేశారు మేకర్స్. ఈ మూవీ నుంచి జూలై 24 సాయంత్రం 4 pmకు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. పొలిటికల్ నేపథ్యంతో ఈ మూవీ రానున్నట్లు సమాచారం. నారా రోహిత్ నుంచి గతంలో వచ్చిన ప్రతినిధి మూవీ రాజాకీయ యాంగిల్ చూపిస్తూ..సమాజంలోని అవినీతిని బయటకు లాగే క్యారెక్టర్ లో నటించిన నారా రోహిత్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
ఇప్పుడు అదే తరహాలో రాబోతున్న ఈ మూవీతో ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తారో అని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. అయితే ప్రతినిధి మూవీకు సీక్వెల్ అనే టాక్ కూడా నడుస్తోంది..ఈ మూవీకు ప్రముఖ TV5 యాంకర్ మూర్తీ డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది.
వానరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీ నారా రోహిత్ కు 19వ సినిమా కాగా..త్వరలో మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇక రోహిత్ చివరిగా 2018లో వీరభోగ వసంత రాయలు చిత్రంలో నటించారు. నారా హీరో నుంచి దాదాపు 5 ఐదేళ్ల తర్వాత మరో మూవీ ప్రకటించడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు.