
- ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు
- హరేకృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఈ నెల 11న నరసింహ జయంతి సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెం.12లో స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు హరేకృష్ణ మూవ్‌మెంట్ తెలంగాణ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభు తెలిపారు. శుక్రవారం ఆలయ ఆవరణలో చంద్ర దాస ప్రభు మాట్లాడుతూ బంజారాహిల్స్‌లోని ఆలయానికి విశిష్ట చరిత్ర ఉందన్నారు.
2011 నుంచి హరేకృష్ణ మూవ్‌మెంట్(ఇస్కాన్) ఈ ఆలయాన్ని నిర్వహిస్తోందని, తెలంగాణలో మొదటి గోల్డెన్ టెంపుల్‌గా అభివృద్ధి చేసిందన్నారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఆలయంలో 11న నరసింహ జయంతి సందర్భంగా కీర్తనలు, మూలవరులకు అభిషేకాలు, నరసింహ హోమం, భూసమేత నరసింహ స్వామి కల్యాణోత్సవం, లక్ష్మీనరసింహస్వామి మహాఅభిషేకం, అక్షయ పాత్ర ద్వారా ఉచిత అన్నదానం ఉంటుందన్నారు. రాత్రి 8 గంటలకు ఆనందోత్సవం, శయన హారతి ఉంటాయన్నారు.