IND vs ENG 2025: పంత్ స్థానంలో కిషాన్‌కు కాకుండా జగదీశన్‌కు ఛాన్స్.. ఎవరీ తమిళనాడు వికెట్ కీపర్..?

IND vs ENG 2025: పంత్ స్థానంలో కిషాన్‌కు కాకుండా జగదీశన్‌కు ఛాన్స్.. ఎవరీ తమిళనాడు వికెట్ కీపర్..?

ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా చివరి టెస్టుకు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయంతో దూరమయ్యాడు. మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా పంత్ కుడి పాదానికి గాయమైంది. గాయంతోనే ఈ టీమిండియా వైస్ కెప్టెన్ బ్యాటింగ్ కొనసాగించాడు. డాక్టర్లు సూచనల మేరకు పంత్ కు ఆరు వారాల పాటు రెస్ట్ కావాల్సి వచ్చింది. దీంతో పంత్ ఓవల్ వేదికగా జరగబోయే ఐదో టెస్టుకు దూరమయ్యాడని బీసీసీఐ సోమవారం (జూలై 28) అధికారికంగా ప్రకటించింది. పంత్ స్థానంలో ఇషాన్ కిషాన్ కు కాకుండా తమిళనాడు వికెట్ కీపర్ నారాయణ్ జగదీశన్ ను ఎంపిక చేశారు.

ఎవరీ నారాయణ్ జగదీశన్:

పంత్ స్థానంలో మొదట బీసీసీఐ ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయాలని భావించినట్టు సమాచారం. కానీ ఈ జార్ఖండ్‌ వికెట్ కీపర్-బ్యాటర్ ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా జగదీశన్ కు జట్టులో చోటు దక్కింది. 29 ఏళ్ల ఈ తమిళనాడు వికెట్ భారత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. సోమవారం (జూలై 28) జగదీశన్ భారత జట్టులో చేరతాడు. ఇప్పటివరకు మొత్తం 52 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన జగదీశన్..47.50 యావరేజ్ తో 3373 పరుగులు చేశాడు. వీటిలో 10 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. చివరి టెస్ట్ కోసం జురెల్ కు ఛాలెంజ్ విసరానున్నాడు. 

2024-25 రంజీ ట్రోఫీ సీజన్‌లో తమిళనాడు తరపున మొత్తం ఎనిమిది మ్యాచ్‌ల్లో 56.16 యావరేజ్ తో 674 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు.  వీటిలో రెండు సెంచరీలు.. ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ 29 ఏళ్ళ వికెట్ కీపర్.. ఘోరంగా విఫలమయ్యాడు.  జగదీశన్ రెండు జట్ల తరపున మొత్తం 13 మ్యాచ్‌లు ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఏడు మ్యాచ్‌ల్లో 73 పరుగులు.. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆరు మ్యాచ్‌ల్లో 89 పరుగులు మాత్రమే చేశాడు. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య చివరిదైన ఐదో టెస్ట్ ఓవల్ లో జూలై 31 జరుగుతుంది.

ALSO READ : ఇంగ్లాండ్ సిరీస్ నుంచి రిషబ్ పంత్ ఔట్.. అఫిషియల్‎గా ప్రకటించిన బీసీసీఐ

ఇంగ్లాండ్ గడ్డపై అదరగొట్టిన పంత్:  

పంత్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. మొత్తం ఏడు ఇన్నింగ్స్‌లలో 479 పరుగులు చేసి ఇంగ్లాండ్ గడ్డపై అదరగొట్టాడు. జూన్ 20 నుండి 24 వరకు లీడ్స్‌లోని హెడింగ్లీలో తొలి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో  (134 మరియు 118) సెంచరీలు కొట్టాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్ ల్లో వరుసగా 25, 65 పరుగులు చేశాడు.  లార్డ్స్ టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేస్తే.. రెండో ఇన్నింగ్స్ లో ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే ఔటయ్యాడు. తాజాగా ముగిసిన మాంచెస్టర్ టెస్టులో గాయంతోనే తొలి ఇన్నింగ్స్ లో 54 పరుగులు చేశాడు. రెండు ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.