ఫిజిక్స్ ఒలంపియాడ్‌‌లో.. నారాయణ స్టూడెంట్లకు మెడల్స్

ఫిజిక్స్ ఒలంపియాడ్‌‌లో.. నారాయణ స్టూడెంట్లకు మెడల్స్

హైదరాబాద్, వెలుగు:  ఫ్రాన్స్‌‌లో  జూలై 18- నుంచి 24 వరకు జరిగిన ఇంటర్నేషనల్‌‌ ఫిజిక్స్ ఒలంపియాడ్‌‌ 2025లో తమ స్టూటెంట్లు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ గెలుచుకున్నారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణ వెల్లడించారు. 87 దేశాల నుంచి 415 మంది విద్యార్థులు పాల్గొనగా..భారత్ తరఫున పాల్గొన్న నారాయణ విద్యార్థులు స్నేహిల్ ఝా (స్వర్ణ), ఆగం షా (రజత) తమ ప్రతిభతో ఆకట్టుకున్నారని తెలిపారు. 

ఈ ప్రతిష్టాత్మక పోటీలో సిద్ధాంతాలు, ప్రయోగాత్మక భౌతిక శాస్త్రాల్లోని జ్ఞానం, తర్కం, విశ్లేషణ సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యంతో ఇద్దరు స్టూడెంట్లు మెరిశారని వివరించారు. ఈ విజయంపై గర్వంగా ఉందని..ఇది తమ విద్యార్థులకు, సంస్థకు మాత్రమేగాక, భారత దేశానికే ఇది గర్వకారణమని సింధూర నారాయణ అన్నారు. నారాయణ విద్యాసంస్థల శిక్షణా విధానమే ఈ విజయానికి కారణమని శరణి నారాయణ  వెల్లడించారు. ఐజేఎస్వో, ఏవీవో, ఐసీహెచ్వో, ఏవోఏఏ వంటి ఒలింపియాడ్‌‌ల్లోనూ నారాయణ విద్యార్థులు విజయం సాధించినట్లు పేర్కొన్నారు.