నారాయణపేట జిల్లా కలెక్టర్ డ్రైవర్ ఆత్మహత్య

నారాయణపేట జిల్లా కలెక్టర్ డ్రైవర్ ఆత్మహత్య

నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్​డ్రైవర్ సుదర్శన్ (38) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన సుదర్శన్​మూడేండ్లుగా కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. ఆస్పత్రిలో చూపించుకొని మందులు వాడుతున్నాడు. బుధవారం ఉదయం మళ్లీ భరించలేని కడుపునొప్పి రావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య నర్మద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు.