డేటా ప్రైవసీని కాపాడుకోవాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

డేటా ప్రైవసీని కాపాడుకోవాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

మమబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: ప్రతి ఉద్యోగి డేటా ప్రైవసీని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నారాయణపేట  కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ సూచించారు. కలెక్టరేట్​లో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఇలాంటి సదస్సులతో డిజిటలైజేషన్​పై బాధ్యతను పెంచడం, సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  భద్రత గురించి తెలుసుకొనే అవకాశం ఉందన్నారు.

అడిషనల్​ కలెక్టర్  సంచిత్  గంగ్వార్, సైబర్  నిపుణుడు, అడ్వకేట్  రూపేశ్​ మిత్తల్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు చెందిన సూర్యప్రకాశ్  హాజరయ్యారు. ఈమెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అకౌంట్లు, మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఫోన్లు, వ్యక్తిగత డేటా రక్షణకు సంబంధించిన పలు చిట్కాలు, సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  హైజీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పాటించే విధానాలు, మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భద్రతా సెట్టింగులు తదితర అంశాలను వివరించారు. పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వినియోగం, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్  అప్ డేట్స్ ప్రాముఖ్యతను వివరించారు.

మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  భద్రత కోసం పర్మిషన్లు నిలిపి వేయడం, ధృవీకరించని యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఉపయోగించకపోవడం, ప్రైవసీ సెట్టింగ్​లపై పలు సూచనలు చేశారు. స్పెషల్  డిప్యూటీ కలెక్టర్  రాజేందర్ గౌడ్, డీఏవో జాన్ సుధాకర్, హౌసింగ్  పీడీ శంకర్ నాయక్, డీపీవో సుధాకర్ రెడ్డి, డీపీఆర్వో రశీద్, ఎస్సీ కార్పొరేషన్​ ఈడీ ఖలీల్, తహసీల్దార్లు, ఎంపీడీలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.