నరెడ్కో 30 ఏళ్ల వేడుకలు.. హైదరాబాద్ లో ఘనంగా వార్షికోత్సవం

నరెడ్కో 30 ఏళ్ల  వేడుకలు.. హైదరాబాద్ లో ఘనంగా వార్షికోత్సవం

హైదరాబాద్​, వెలుగు: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) తెలంగాణ విభాగం 30 ఏళ్ల వార్షికోత్సవాన్ని హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించింది. 1995లో స్థాపించిన ఈ సంస్థ మూడు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వం, పరిశ్రమ, వినియోగదారుల మధ్య వారధిగా ఉంటూ పారదర్శకమైన వృద్ధికి తోడ్పడుతోంది. 

నరెడ్కో తెలంగాణ నిర్వహించే ప్రాపర్టీ షోలు ఇతర కార్యక్రమాల ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధి, విధానపరమైన సంస్కరణలపై అర్థవంతమైన చర్చలు సాగుతున్నాయి. నైతిక విలువలు, నిబంధనలపై అవగాహన కల్పిస్తూ కొనుగోలుదారుల ప్రయోజనాలను ఈ సంస్థ కాపాడుతోంది. 

నమ్మకమైన డెవలపర్లు, ధ్రువీకరించిన ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇండ్లు, విల్లాలు లేదా ప్లాట్లు కొనాలనుకునే వారు సరైన నిర్ణయం తీసుకోవడానికి నరెడ్కో సహాయపడుతోందని నరెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ మేక విజయసాయి   చెప్పారు. 2010 నుంచి విధానపరమైన చర్చలు, సదస్సుల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సహకారాన్ని పెంచినట్లు ఈ సందర్భంగా ఆయన వివరించారు.